ఏపీలో ఆగని కొత్త కరోనా కేసుల సంఖ్య… నేడు కొత్తగా 7,228 కేసులు…!

September 23, 2020 at 5:22 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ శాఖ గడిచిన 24 గంటలలో నమోదైన కరోనా వైరస్ వివరాలను మీడియా పూర్వకంగా విడుదల చేసింది. ఇక పూర్తి వివరాలు చూస్తే మొత్తంగా 72,838 మందిని పరీక్షించగా అందులో 7,228 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్రంలో నేటి వరకు కరోనా కేసుల సంఖ్య 6,43,635 కు చేరుకుంది. ఇక మరోవైపు కరోనా వైరస్ నుండి గడచిన 24 గంటల్లో 8291 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 5,67,772 కు చేరుకుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 70,357 గా ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 45 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా కాటుకు రాష్ట్రవ్యాప్తంగా 5506 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పటివరకు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 90,047 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల పరంగా చూస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో కరోనా బారిన పడి 609 మంది మృత్యువాత పడ్డారు.

ఏపీలో ఆగని కొత్త కరోనా కేసుల సంఖ్య… నేడు కొత్తగా 7,228 కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts