శ్రీనువైట్ల చాలెంజ్‌ను స్వీక‌రించిన టాలీవుడ్ విలన్ !

September 29, 2020 at 10:31 am

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు సోనూ సూద్ ఇప్పుడు ప్ర‌కృతిలో భాగ‌స్వామి అయ్యారు. టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయ‌న సోమవారం మొక్క‌ల‌ను నాటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం స్ఫూర్తితో ఎంపీ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులు, సినీతార‌లు పాల్గొని మొక్క‌లు నాటారు.

ఇదిలా ఉండ‌గా ఈ కార్య‌క్ర‌మంలో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల సైతం పాల్గొని మొక్క‌ల‌ను నాటారు. అనంత‌రం న‌టుడు సోనూ సూద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు. దీనిని స్వీకరించిన సోనూ ఈరోజు మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు. మొక్క‌ల‌ను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగ‌స్వామిని కావడం ఆనందంగా ఉందని వివ‌రించారు. అదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు.

శ్రీనువైట్ల చాలెంజ్‌ను స్వీక‌రించిన టాలీవుడ్ విలన్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts