న‌టి శ్రావ‌ణిని ముగ్గురు వాడుకున్నారు..

September 15, 2020 at 9:08 am

ప్రేమ పేరుతో వంచించారు. పెండ్లి చేసుకుంటామ‌ని న‌మ్మించారు. తీరా అస‌లు విష‌యానికి వ‌చ్చే సిరికి మొహం చాటేశారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెకు ఇతరులతో అక్ర‌మ సంబంధాలు అంటగడుతూ మానసికంగా వేధించారు. వాటితో మ‌న‌స్తాపం చెంది టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు త‌మ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేయ‌గా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్ తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. ఏపీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన కొండపల్లి శ్రావణి (26) ఎనిమిదేండ్ల క్రితం కుటుంబంతో స‌హా హైదరాబాద్‌కు వచ్చి మధురానగర్‌లో నివాస‌ముంటున్న‌ది. టీవీ సీరియల్స్‌లో నటించేది. ఈ క్ర‌మంలో యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో నివాస‌ముంటున్న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన సా యికృష్ణారెడ్డి (28)తో శ్రావణికి ఐదేండ్ల క్రితం ప‌రిచ‌యం ఏర్పడింది. వారిద్ద‌రు మూడేండ్లు ప్రేమించుకున్నాక 2018లో వీరు విడిపోయారు.

అటుత‌రువాత శ్రావణికి ‘ప్రేమతో కార్తీక’ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ సినిమా నిర్మాత అశోక్‌రెడ్డితో ఏర్పడిన చనువు.. శారీరక సంబంధానికి దారితీసింది. ఇదిలా ఉండ‌గా 2019 ఆగస్టు 8న కాకినాడకు చెందిన టీవీ నటుడు దేవరాజ్‌రెడ్డి అలియాస్‌ సన్నీతో శ్రావణికి పరిచయం కలిగింది. చిట్టితల్లి సీరియల్‌ ఆడిషన్స్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన దేవరాజ్‌రెడ్డి 2019 నవంబర్‌లో శ్రావణి ఇంట్లోనే 9 రోజులు ఉన్నాడు. అప్పుడు వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్ని రోజులకు అశోక్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో కూడా శ్రావణి ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు దేవరాజ్ తెలుసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 22న శ్రావణి తన ఫ్రెండ్‌ సమీర్‌ బర్త్‌ డే పార్టీలో తాను దేవరాజ్‌రెడ్డిని పెండ్లి చేసుకుంటున్నానని ప్రకటించ‌గా, దీనిపై దేవరాజ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ‘నీకు అశోక్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో సంబంధాలున్నాయి’ అంటూ పెండ్లికి నిరాకరించాడు. కాగా, శ్రావణి తనకు ఎవరితో సంబంధాలు లేవంటూ సముదాయిస్తూనే ఉన్నది. ఈ క్ర‌మంలో సెప్టెంబర్‌ 7న రాత్రి దేవరాజ్‌రెడ్డి శ్రావణిని ఓ హోటల్‌కు డిన్నర్‌కు తీసుకెళ్ల‌గా, అదే స‌మ‌యంలో సాయికృష్ణారెడ్డి వచ్చి దేవరాజ్‌తో గొడవ పడి, శ్రావణిని కొట్టి ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. తనను కుటుంబసభ్యులు, అశోక్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని శ్రావణి ఫోన్‌లో దేవరాజ్‌కు చెప్పి సెప్టెంబర్‌ 8న రాత్రి ఇంట్లో ఉరివేసుకొని శ్రావ‌ణి ఆత్మహత్య చేసుకున్నద‌ని విచారణలో పోలీసులు తేల్చారు.

న‌టి శ్రావ‌ణిని ముగ్గురు వాడుకున్నారు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts