
రహదారులన్నీ రక్తపు మాడుగుల తయారవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో చాల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే తాజాగా నగరంలోని పాతబస్తీలో బుధవారం మధ్యాహ్నం వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ఈ వేరువేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిశాయి.
పూర్తి వివరాలోకి వెళ్తే.. మంగళ్‌హాట్ సీతారామ్‌బాగ్‌లో పోలీసు గస్తీ వాహనం ఢీకొని హర్షవర్ధన్ అనే బాలుడు మృతి చెందాడు. ఇక నగరంలోని చాంద్రాయణగుట్టలో టిప్పర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మారుయం ప్రాణాలు కోల్పోయింది. ఈ రెండు ఘటనలపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.