త‌మిళ‌నాడులో ఇద్దరు మహిళలు దారుణ హత్య..!

September 26, 2020 at 7:02 pm
murder

త‌మిళ‌నాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ తిరునెల్వేలి జిల్లా పరిధిలోని మారుగల్‌కురిచిలో శ‌నివారం ఇద్ద‌రు మ‌హిళ‌లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులను ఎ. షణ్ముగతై (50), ఎస్. శాంతి (45) గా గుర్తించారు. వీరి కుమార్తె సెల్వి (14) పై సైతం క‌త్తుల‌తో దాడి చేయ‌గా స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింద‌ని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. గ‌డిచిన మార్చిలో గ్రామంలో జ‌రిగిన జంట హ‌త్య‌లకు ప్ర‌తీకారంగా ఈ హ‌త్య‌లు చోటుచేసుకొని ఉండొచ్చ‌ని జిల్లా ఎస్పీ ఎన్‌. మ‌ణివ‌న‌న్ తెలిపారు. స్థానికుల వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన రెండు ప్రత్యర్థి వ‌ర్గాల‌ మధ్య జరిగిన ఐదవ హత్యగా ఎస్పీ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన నంబిరాజన్ గ‌తేడాది టి. వాన్మతి (18) అనే స్థానిక బాలికతో పారిపోయాడని తెలిపారు.

త‌మిళ‌నాడులో ఇద్దరు మహిళలు దారుణ హత్య..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts