మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

September 17, 2020 at 7:34 am

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో కూడా అర్థంగాక ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎక్క‌డో చైనాలో ప్రారంభ‌మైన ఈ క‌రోనా ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నా.. ఇంకా వేగంగానే విజృంభిస్తూ ల‌క్ష‌ల ప్రాణాలు బ‌లితీసుకుంటోంది. ఇక సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ‌నాయ‌కులు అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా ఎటాక్ చేస్తోంది.

తాజాగా మ‌రో కేంద్ర మంత్రి క‌రోనా బారిన ప‌డ్డారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. తనకు నిన్న నీరసంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని.. అదే క్రమంలో కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తన ట్విట్టర్ లో వెల్లడించారు. ప్ర‌స్తుతం నితిన్ గ‌డ్క‌రీ కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఆయ‌న‌ను కలిసిన వారంతా క‌రోనా టెస్ట్‌లు చేయించుకోవాల‌ని అధికారులు సూచించారు. కాగా, ఇప్ప‌టికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, శ్రీపాద్ నాయక్ సహా పలువు కేంద్ర మంత్రులకు క‌రోనా సోకిన‌ సంగ‌తి తెలిసిందే.

మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts