యూపీలో ఈవ్‌టీజింగ్‌కు పాల్ప‌డితే ఇక అంతే.. యోగి మార్క్ శిక్ష‌

September 25, 2020 at 12:54 pm

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రం క్రైం రేట్‌లో యూపీ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అదేవిధంగా మ‌హిళ‌ల‌పై వేధింపులు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఈవ్‌టీజ‌ర్ల‌కు త‌గిన బుద్ధి చెప్పేందుకు యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ స‌రికొత్త మార్గానికి శ్రీ‌కారం చుట్టారు. వినూత్న ప‌ద్ధ‌తిలో ఈవ్‌టీజ‌ర్ల‌ను స‌భ్య స‌మాజంలో సిగ్గుప‌డేలా చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అందులో భాగంగా ఆప‌రేష‌న్ దురాచారి పేరిట ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. వివ‌రాల్లోకి వెళ్లితే..

అమ్మాయిల‌పై అత్యాచారం, వేధింపుల‌కు పాల్ప‌డేవారి ఫొటోల‌ను, వివ‌రాల‌ను సేక‌రించి వాటిని ఫ్లెక్సీలుగా రూపొందించి రోడ్ల‌కు ఇరువైపులా ప్ర‌ద‌ర్శించి ప్ర‌చారం చేయాల‌ని యూపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డం ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. గ‌తంలో ఈవ్‌టీజింగ్‌లు, అత్యాచారాల‌కు పాల్ప‌డ్డ వారి వివ‌రాల‌ను కూడా అందులో పెట్టాల‌ని, అందుకు కావాల్సిన వివ‌రాల‌ను సేక‌రించాల‌ని సీఎం యోగి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. యూపీ స‌ర్కారు చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ దురాచారి కార్య‌క్ర‌మంపై మ‌హిళ‌ల్లో హ‌ర్షం వ్య‌క్తమ‌వుతున్న‌ది.

యూపీలో ఈవ్‌టీజింగ్‌కు పాల్ప‌డితే ఇక అంతే.. యోగి మార్క్ శిక్ష‌
0 votes, 0.00 avg. rating (0% score)