ఉరి తీస్తారా? లేదా..? ఉదృతంగా మారుతున్న ఆందోళనలు..?

September 30, 2020 at 3:29 pm

ఉత్తరప్రదేశ్లోని హత్రాసులో ఓ యువతిపై కొంతమంది యువకులు లైంగికదాడికి పాల్పడి సామూహిక అత్యాచారం చేయడం.. అనంతరం హత్య చేయడం సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆందోళనకు దిగి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పలు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అత్యాచార నిందితులకు ఉరి శిక్ష విధిస్తారా లేదా అంటూ… అధికారులను ప్రశ్నిస్తున్నారు బాధిత యువతి కుటుంబ సభ్యులు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేస్తున్నారు. అంతేకాకుండా బాధిత యువతి కుటుంబీకులకు వివిధ పార్టీల నుంచి కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో… పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేపడుతున్నారు. కాగా ప్రస్తుతం అత్యాచార నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చివరికి బాధిత కుటుంబ సభ్యుల అనుమతితో యువతి అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుపై సిట్ దర్యాప్తుకు ఆదేశించినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

ఉరి తీస్తారా? లేదా..? ఉదృతంగా మారుతున్న ఆందోళనలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts