‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు జోడీగా ఊహించ‌ని హీరోయిన్‌?

September 8, 2020 at 1:05 pm

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ చేయబోతున్నాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరో భారీ సినిమాను ఇటీవ‌ల ప్ర‌భాస్‌ ప్రకటించాడు. ‘తనాజీ’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ ప్రాజెక్ట్ ను చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌భాస్ ప్ర‌క‌టించాడు.

Coronavirus Scare: For Urvashi Rautela, Holi Is An Intimate Affair

దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో 3డీ ఫార్మాట్ లో ఈ చిత్రంను టీసిరీస్ నిర్మించనుంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా.. హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మించ‌నున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ప్ర‌భాస్‌కు జోడీ(సీత)‌గా ఎవ‌రు న‌టించ‌బోతున్నారు అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

ఈ క్ర‌మంలోనే కీర్తి సురేష్, కియారా అద్వాణీ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ పాత్ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆమె ఎవ‌రో కాదు.. మాజీ మిస్ ఇండియా(2015) ఊర్వశి రౌటెలా. ఈ పాత్రకు ఊర్వశి బాగా సరిపోతుందని భావిస్తోన్న దర్శకుడు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే.. మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు జోడీగా ఊహించ‌ని హీరోయిన్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts