మిస్ ఇండియా ఉర్వ‌శి రౌటేలా ప్ర‌మోష‌న్ సాంగ్‌..

September 30, 2020 at 7:33 pm

షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’ లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని, ‘విచక్షణ లేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ తో మ‌హిళా ప్ర‌ధాన పాత్ర‌తో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది క‌థ‌ను అందించ‌గా, మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సార్లు మిస్ ఇండియా గా గెలుపొందిన అందాల తార ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటిస్తుండ‌గా, ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్ట‌ర్కు సినీ అభిమానుల‌ను విశేష స్పందన లభించింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ప్రమోషనల్ వీడియో సాంగ్ ని చిత్ర‌బృందం విడుదల చేసింది. మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేసిన ఈ పాట‌ను యువ‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్ విడుద‌ల చేయడం విశేషం. ఈ పాటని తెలుగు, హిందీ భాషల్లో హారిక నారాయణ్ పాడ‌గా, తెలుగు పాటని సంపత్ నంది ర‌చించారు. ఈ సాంగ్ లో హీరోయిన్ ఊర్వశి తన అందంతోపాటు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ డాన్స్ స్టెప్స్ స్ఫూర్తిగా కంపోజ్ చేసిన డాన్స్ రిహార్సల్స్ చేస్తూ స్వతహాగా మంచి డాన్సర్ అయినా ఊర్వశి పలుమార్లు గాయపడినా చివ‌ర‌కు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కుర్ర‌కారును హోరెత్తిస్తున్నారు. ఆగష్టు లో ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు. హిందీ భాషల్లో ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని ఇటీవ‌ల పూర్తిచేసింది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి.

మిస్ ఇండియా ఉర్వ‌శి రౌటేలా ప్ర‌మోష‌న్ సాంగ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts