లేడీ టీచ‌ర్ల బాత్రూంలో కెమెరాలు.. క‌ర‌స్పాండెంట్ ఘాతుకం

September 26, 2020 at 6:38 pm

క‌రోనా మ‌హ‌మ్మారితో ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్ల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. ఉపాధిలేక అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. గ‌తంలో ప‌నిచేసిన నెల‌ల‌కు సంబంధించిన జీతాల‌ను కూడా కొంద‌రు యాజ‌మాన్యాలు ఇవ్వ‌డం లేదు. ఇదే విష‌య‌మై ఓ ఇద్ద‌రు లేడీ టీచ‌ర్లు త‌మ పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్‌ను అడుగుదామ‌ని వెళ్లారు. అయితే జీతం ఇవ్వ‌క‌పోగా వారికి రెండు సీడీల‌ను ఇచ్చి వాటిని చూడ‌మ‌ని చెప్ప‌డంతో వారు తొలుత ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక ఆ సీడీల‌ను చూసిన త‌రువాత షాక్ తిన్నారు. వారు బాత్రూంలోకి వెళ్లిన దృశ్యాల‌ను చూసి నోరెళ్ల‌బెట్టారు. కీచ‌క క‌ర‌స్పాండెంట్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘ‌ట‌న యూపీ రాష్ట్రం మీర‌ట్‌లో వెలుగుచూసింది.

పోలీసుల‌, బాధితుల క‌థ‌నం ప్ర‌కారం.. మీరట్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు లేడీ టీచర్లు కొంత కాలంగా ప‌నిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో స్కూల్లు మూత‌ప‌డ‌డంతో ఉపాధి కోల్పోయారు. అయితే గ‌తంలో తాము ప‌నిచేసిన నెల‌ల‌కు రావాల్సిన జీతాన్ని ఇవ్వాల‌ని స్కూలు యజమానిని అడిగారు. స‌ద‌రు క‌ర‌స్పాండెంట్ జీతం ఇవ్వ‌క‌పోగా సదరు లేడీ టీచర్లు బాత్రూంకు వెళ్లి నప్పుడు సీక్రెట్ కెమెరాల‌తో రికార్డు చేసిన వీడియోల‌ను వారి ముందు పెట్టాడు. అదీగాక బయట ఈ విషయం చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే కాదు తన లైంగిక కోరికలు తీర్చాలంటూ వేధింపులను మొద‌లు పెట్టాడు. వాటిని త‌ట్టుకోలేక బాధిత మహిళలు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, అధికారులు రంగంలోకి దిగి, క‌ర‌స్పాండెంట్‌ను అదుపులోకి తీసుకున్నాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

లేడీ టీచ‌ర్ల బాత్రూంలో కెమెరాలు.. క‌ర‌స్పాండెంట్ ఘాతుకం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts