ఇక ఇంట్లో ఉండే పోలీసులకి పిర్యాదు చెయ్యొచ్చు..!

September 21, 2020 at 3:07 pm

ఏపీ పోలీస్ శాఖ ప్రజలందరికీ మెరుగైన సర్వీసులను అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ పోలీస్ శాఖ… అందరికీ మేలు జరిగే విధంగా ఓ వినూత్న యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలందరూ పోలీస్ స్టేషన్ కు రాకుండా ఇంటి దగ్గర నుంచి అన్ని రకాల నేరాలకు పోలీసులకు ఫిర్యాదు చేసే విధంగా ఓ వినూత్న యాప్ రూపొందించింది ఏపీ పోలీస్ శాఖ.

ఏపీ పోలీస్ సేవ అనే పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక ఈ యాప్ ద్వారా అన్ని రకాల నేరాలకు ప్రజలు ఇంటి వద్ద నుంచి ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. యాప్ లో ఏకంగా 87 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని… అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ యాప్ అనుసంధించబడి ఉంటుంది అంటూ అధికారులు తెలిపారు. యాప్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇక ఇంట్లో ఉండే పోలీసులకి పిర్యాదు చెయ్యొచ్చు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts