ఉపేంద్ర కోసం ఎగ్జ‌యిటింగ్‌గా చూస్తున్నా..

September 18, 2020 at 5:19 pm

క‌రోనా నుంచి కాస్తా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ తిరిగి గాడిన ప‌డుతున్న‌ది. మూవీ షూటింగ్‌లు ప‌ట్టాలెక్కుతున్నాయి. ఇదే క్ర‌మంలో టాలీవుడ్ యాక్ట‌ర్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేప‌థ్యంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం విధిత‌మే. ఇక మూవీలో క‌న్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఇవాళ ఉపేంద్ర పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూవీ స‌భ్యులు ఆయ‌న బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఉపేంద్ర‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన వ‌రుణ్ తేజ్‌..ఉపేంద్ర‌తో క‌లిసి సినిమా కోసం ప‌ని చేసేందుకు చాలా ఎక్స‌యిటింగ్ గా ఎదురుచూస్తున్న‌ట్టు త‌న ట్విట‌ర్ లో పోస్ట్ పెట్టాడు.

క‌న్న‌డ‌స్టార్ ఉపేంద్ర ఏ, త‌దిత‌ర సినిమాల‌తో చాలా ప్రాచుర్యం పొందారు. ఇటీవ‌ల కాలంలో అల్లు అర్జున్ న‌టించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి మూవీలో కీల‌క పాత్ర‌ను పోషించి అభిమానుల మ‌న్న‌న‌లు పొందారు. ఇదిలా ఉండ‌గా, ప్ర‌స్తతం వ‌రుణ్ తేజ్ న‌టించిన సినిమాలోనూ ముఖ్య‌పాత్ర‌ను పోషించ‌నున్నారు. ఈ సినిమాలో ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని రోల్ లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌నుండ‌గా..ఉపేంద్ర ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడో తెలియాల్సి ఉంది. అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా..రేనై స్సేన్స్ ఫిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అల్లు వెంక‌టేశ్‌, సిధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక వ‌ర‌ణ్‌తేజ్తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ఉపేంద్ర‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. కిచ్చా సుదీప్ ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపి త‌న అభిమానాన్ని చాటుకున్నారు.

ఉపేంద్ర కోసం ఎగ్జ‌యిటింగ్‌గా చూస్తున్నా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts