బాలు ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా?

September 25, 2020 at 7:10 am

సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. చెన్నై ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్ లో బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం అని పేర్కొన్నారు. దీంతో బాలు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు.

బాలు చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రికి ఫోన్ చేసి ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అయితే బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని, తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెంకయ్యకు వైద్యులు తెలిపారు. ఇక ఇప్ప‌టికే బాలు పరిస్థితి క్షీణించిందన్న సమాచారంతో నటుడు కమలహాసన్ హుటాహుటీన ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. బాలు ప్రస్తుత పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ బాలు క్షేమంగా ఉన్నారని చెప్పలేను కానీ, ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అభిమానుల్లో, సన్నిహితుల్లో ఆందోళన మొదలైంది. కాగా, ఎస్పీబాలు ఆగస్టు 5న క‌రోనాతో ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఎక్మో, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. అయితే ఆయ‌నకు క‌రోనా త‌గ్గిపోయినా.. ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఉండడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.

బాలు ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts