ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా!

September 30, 2020 at 7:32 am

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎప్పుడో మూడో కోట్లు దాటిపోయింది. ఇక సామాన్యుడు, సెల‌బ్రెటీ, రాజ‌కీయ నాయ‌కుడు అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది.

ఇక తాజాగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు క‌రోనా వైర‌స్ సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని.. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ రొటీన్‌గా నిర్వహించే పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

దీంతో వెంకయ్య నాయుడు కుటుంబసభ్యులకు కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. వారికి నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ఇక ఇటీవలి కాలంలో ఆయ‌న‌తో సన్నిహితంగా మెలిగినవారు గానీ, కాంటాక్ట్ లో ఉన్నవారు గానీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts