వైరల్‌ వీడియో : వెంటిలేటర్‌పై చేతులకు సంబంధించిన వ్యాయామం చేసిన బాలు

September 25, 2020 at 6:03 pm

తన పాటతో అందరి మనసుల్ని దోచుకున్న గాయకుడు  ఎస్పీ బాలసుబ్రమణ్యం.ఆయన పాట పడితే చాలు అందరి మది పులకించిపోతుంది. ఆయన పేరు వింటే చాలు ఎన్నో స్వరాలు మదిలో మెదులుతాయి. అలాంటి ఆ స్వరం ఈరోజు మూగపోయింది. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న బాలు ఈరోజు మనతో లేరు. ఆయన మృతితో ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఎస్పీ బాలు మృతికి సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో  ఎస్పీ బాలు హాస్పిటల్ లో ఉన్నపుడు వెంటిలేటర్‌పై ఉండగా వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..  ఎస్పీ బాలు తన చేతులకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నట్లు కనిపిస్తుంది.  కొద్ది సేపటి తర్వాత ఎంతో అలసటతో ఆయన వ్యాయామాన్ని ఆపేశారు.వైద్యులు మళ్లీ వ్యాయామం చేయించే ప్రయత్నం చేయగా బాలుగారు  చేతులు కదపలేక వద్దని వారించారు.  దాదాపు 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు.

వైరల్‌ వీడియో : వెంటిలేటర్‌పై చేతులకు సంబంధించిన వ్యాయామం చేసిన బాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts