వైరల్ వీడియో : రాత్రి సమయంలో ఫుట్‌పాత్ మీద ఓ వింతజీవి…చివరికి..?

September 28, 2020 at 4:48 pm

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏమి జరిగినా కూడా క్షణాలలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఇక తాజాగా రాత్రి సమయంలో రోడ్డు మీద ఫుట్ పాత్ మీద ఒక వింత జీవి తిరుగుతుందని ప్రజలు కాస్తా భయాందోళనకు గురయ్యారు. కానీ, చివరకు అది వింతజీవి కాదు ఒక రోబో కుక్క అని తెలుసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే కెనడాలోని అంటారియో లో ఒక వీధిలో ఫుట్ పాత్ పై ఈ రోబో డాగ్ ను చూసి స్థానికులు ముందుగా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈ రోబో డాగ్ పేరు స్పాట్. ఈ రోబో డాగ్ గొర్రెల కాపరి గా పనిచేయడంతో పాటు.. ప్రజలను సామాజిక దూరం పాటించేలాగా అప్రమత్తం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నాథన్ కనసావే అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా చేసుకొని షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

వైరల్ వీడియో : రాత్రి సమయంలో ఫుట్‌పాత్ మీద ఓ వింతజీవి…చివరికి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts