వ్యవసాయ బిల్లు డెత్ వారెంట్ లాంటిది.. ఎంపీ ఘాటు విమర్శలు..!

September 20, 2020 at 3:10 pm

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి విషయం తెలిసిందే. కార్పొరేట్ వ్యాపారులకు కొమ్ముకాసే విధంగా ఈ వ్యవసాయ బిల్లు ఉందని ఈ బిల్లు ద్వారా రైతులందరికీ ఎంతో అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు వేదికగా ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఈ బిల్లుపై మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు… రైతులందరికీ వారెంట్ జారీ చేసినట్లుగా ఉంది అంటూ సంచలన విమర్శలు చేశారు. రైతులకు అన్యాయం జరిగే బిల్లులకు కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు ప్రకటించదు అంటూ ఆయన తెలిపారు. ఇప్పటికే రాజ్యసభ వేదికగా మరికొంత మంది ఎంపీలు కూడా వ్యవసాయ బిల్లు పై వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్ష పార్టీల ఎంపీల విమర్శల మధ్య… రాజ్య సభ వేదిక వ్యవసాయ బిల్లు ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.

వ్యవసాయ బిల్లు డెత్ వారెంట్ లాంటిది.. ఎంపీ ఘాటు విమర్శలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts