వైసీపీలో క‌రోనా క‌ల‌వరం.. మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!

September 28, 2020 at 1:27 pm

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంద‌రికో ఈ వైర‌స్ సోకింది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద స‌వాల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఏపీలో అధికారిక పార్టి అయిన వైఎస్ఆర్‌సీపీలో క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ చేసిందిన ప‌లువురు ఎమ్మెల్యే, ఎంపీలు, సీనియ‌ర్ నేత‌లు క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా మ‌రో ఎమ్మెల్యేకు వైర‌స్ సోకింది.

సత్యవేడు వై‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. ఈ క్ర‌మంలోనే ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించ‌గా.. పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఆయనకు తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కరోనాకు చికిత్స అందుతోందని తెలిసింది.

వైసీపీలో క‌రోనా క‌ల‌వరం.. మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts