`ఆర్ఆర్ఆర్`‌లో చిన్నప్పటి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు వీరే?

September 27, 2020 at 12:16 pm

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క ‌ధీరుడు రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఇప్ప‌టికే దాదాపు 70 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్.. క‌రోనా కార‌ణంగా పెండింగ్‌లో పడింది.

ప్ర‌స్తుతం మెల్లమెల్లగా ఒక్కొక్కరూ షూటింగులు మొదలుపెడుతుండడంతో రాజమౌళి కూడా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హీరోలు ఎన్టీఆర్, చరణ్ లతో చర్చించిన మీదట విజయదశమి తర్వాత షూటింగును ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంల ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భట్‌ చిన్నప్పటి పాత్రల్లో నటించేది వీరేనంటూ ఎన్టీఆర్ కొన్ని ఫొటోలును విడుద‌ల చేశారు.

హిందీలో పలు చిత్రాల్లో నటించిన వరుణ్ బుద్దాదేవ్‌ ఎన్టీఆర్‌గా కనిపించనుండ‌గా.. పలు తెలుగు చిత్రాల్లో నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చక్రి, రామ్ చరణ్ పాత్రలో నటించనున్నారు. అలాగే ఉడాన్ సీరియల్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన స్పందన్ చతుర్వేది అలియా పాత్రలో కనిపించనున్నారు. ప్ర‌స్తుతం వీరి ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్‌లో కానీ ఆ తర్వాత కానీ విడుదల‌వ్వ‌నుంది.

 

`ఆర్ఆర్ఆర్`‌లో చిన్నప్పటి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు వీరే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts