ఇంటింటా వైఎస్సార్‌ బీమా.. అర్హులకు క‌నీసం రూ.2లక్షలు!

September 16, 2020 at 7:46 am

ఏపీ ప్రభుత్వం బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి సాయం అందించేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే కార్యక్రమం చేపట్టింది. వార్డు, గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులైన పేదల పేర్లు నమోదు చేసుకుని, వారికి వైఎస్సార్‌ బీమా పథకంలో భాగస్వామ్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేప‌ట్టారు.

18 నుంచి 50 సంవత్సరాల్లోపు వయసు కలిగిన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం పొందినా రూ.5 లక్షల బీమా బాధిత కుటుంబానికి అందుతుంది. సహజ మరణం అయితే మాత్రం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. 51 నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు మరణించినా.. శాశ్వత వైకల్యం పొందినా రూ.3 లక్షల పరిహారం అందుతుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

కాగా, గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలు బియ్యం కార్డుల్ని కలిగి ఉన్నాయి. వీరందరికీ ఈ పథకం వర్తించ‌నుంది. నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు బీమా ధీమా కల్పించేందుకు ఏపీ స‌ర్కార్‌ వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిన‌ట్టు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇంటింటా వైఎస్సార్‌ బీమా.. అర్హులకు క‌నీసం రూ.2లక్షలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts