
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే మరో మహత్తర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా రైతులందరికీ చేయూత అందించే విధంగా… వైయస్సార్ జల కళ అనే పథకాన్ని ప్రారంభించింది ఏపీ సర్కార్. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది రైతులకు ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయించేందుకు నిర్ణయించింది.
తద్వారా రైతులందరికీ చేయూత అందించి మరింత ఉత్సాహంగా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సాహం అందించేందుకు నిర్ణయించారు. అయితే 2.5 ఎకరాల పొలం ఉన్న రైతు అయినా సరే వైయస్సార్ జలకల పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటూ ప్రభుత్వం సూచించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు బోర్లు పొందే అవకాశం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే నేరుగా గ్రామ పంచాయతీ సచివాలయం లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆధార్ వివరాలు ప్రభుత్వ విభాగాల తో అనుసంధానం ఉన్నట్లు అయితే… ysrjalakala.Ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.