క‌రోనాతో తిరుప‌తి వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతి

September 16, 2020 at 6:59 pm

వెంక‌ట‌గిరి రాజా ద‌గ్గ‌ర డ్రైవ‌ర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రి.. ఎంపి వ‌ర‌కు దుర్గాప్ర‌సాద్ ప్ర‌స్థానం
లేదా
క‌రోనాతో తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతి.. పొలిటిక‌ల్ హిస్ట‌రీ ఇదే
చిత్తూరు జిల్లా తిరుప‌తి వైఎస్సార్‌సీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ( 64) క‌రోనాతో బుధ‌వారం సాయంత్రం మృతి చెందారు. అత్యంత సాధార‌ణ మ‌నిషిగా ఉన్న ఆయ‌న నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి రాజా ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేశారు. 1985లో ఎన్టీఆర్ వెంక‌ట‌గిరి రాజాకు వెంక‌ట‌గిరి టిక్కెట్ ఆఫ‌ర్ చేశారు. అయితే రాజా దుర్గా ప్ర‌సాద్‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని కోర‌డంతో ఎన్టీఆర్ 1985లో దుర్గాప్ర‌సాద్‌కు సీటు ఇవ్వ‌గా ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న 1994, 1999, 2009లో మ‌రో మూడు సార్లు మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

1995లో చంద్ర‌బాబు కేబినెట్లో విద్యాశాఖా మంత్రిగా ప‌ని చేసి అనేక సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న ఆయ‌న‌కు చంద్ర‌బాబు 2014లో సీటు ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి తిరుప‌తి ఎంపీగా 2 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.

క‌రోనాతో తిరుప‌తి వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts