సీఐకి వార్నింగ్ ఇస్తూ అడ్డంగా బుక్కైన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి?

September 19, 2020 at 9:10 am

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వరసగా వివాదాల్లో చిక్కుకుంటూ పార్టీకి త‌ల‌నొప్పిగా మారుతున్నారు. తాజాగా ఈమె మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఉండవల్లి శ్రీదేవి.. ఓ సీఐకి వార్నింగ్ ఇస్తున్న‌ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘హలో.. ఎప్పటి నుంచి చెప్తున్నా?, వాళ్లను పంపేయొచ్చుగా.. నీకేమైనా మెంటలా? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్. ఎమ్మెల్యే అంటే రెస్పెక్ట్ లేదా? అందరిని అయితే వదిలిపెడతావా? నాన్సెన్స్.. నువ్వు పంపిస్తావా? లేదా చెప్పు` అంటూ రెచ్చిపోయారు.

`నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావు, రెండు నిమిషాల్లో వెళ్లిపోతావు. ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. ఎస్పీకి, డీజీపీకి చెబుతా` అంటూ హెచ్చరించారు. కాగా, అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నందుకు, వారిని వదిలి పెట్టాలంటూ శ్రీదేవి ఇలా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం ఈ ఆడియోపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సీఐకి వార్నింగ్ ఇస్తూ అడ్డంగా బుక్కైన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts