కరోనా నుండి బయటపడిన 172 కిలోల మహిళ…!

October 7, 2020 at 8:26 pm

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా కోలుకోలేక చనిపోయిన వారు ఎందరో. అయితే కొంతమంది వారి శరీరంలో ఎన్ని రోగాలు ఉన్న కరోనా నుంచి కోలుకున్న వారు ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే శరీరంలో షుగర్, ఉబ్బసం, క్యాన్సర్ లాంటి ఇతర వ్యాధులు ఉండి వాటితో పాటు ఆవిడ 175 కేజీల బరువు ఉన్న కూడా కరోనా వైరస్ బారినపడి కూడా కోలుకుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే.

ముంబై నగరానికి చెందిన 62 సంవత్సరాల మేహనాజ్ లొఖండ్ అనే మహిళ 175 కేజీల బరువు ఉన్న కానీ చాలా త్వరగా కరోనా బారినుండి కోలుకుంది. మామూలుగా శరీరంలో ఏవైనా దీర్ఘకాలిక రోగాలు ఉండే వారు కరోనా వైరస్ నుంచి కోలుకోవడం చాలా కష్టమని నిపుణులు తెలిపారు. అయితే ఈవిడ మాత్రం సరైన సమయంలో వైద్యుల సమక్షంలో మంచి ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఆవిడ కరోనా వైరస్ నుండి అతి సులువుగా బయటపడింది. ఆసుపత్రిలో ఆవిడ చికిత్స పొందే సమయంలో రోజుకు 15 లీటర్ల ఆక్సిజన్ ను అందించారు. ఈ సందర్భంగా ఆవిడా మాట్లాడుతూ వైద్యులు అందించిన చికిత్స ద్వారా అని తాను కరోనాను తొందరగా జయించగలిగానని చెబుతోంది. అంతేకాదు కరోనా వైరస్ ని జయించగలనన్న దృఢ సంకల్పం ఉంటే కచ్చితంగా అందులో నుంచి బయటపడవచ్చని ఆవిడ తెలిపింది.

కరోనా నుండి బయటపడిన 172 కిలోల మహిళ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts