20 ఏళ్ళు కరోనా టీకా ఎంతైనా అవసరం..!

October 23, 2020 at 1:18 pm

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో వైరస్కు వ్యాక్సిన్ వస్తే తప్ప పరిస్థితులు అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రజానీకం వెయ్యి కళ్ళతో వ్యాక్సిన్ ఎదురు చూస్తుంది. కాగా ఇప్పటికే పలు దేశాలు వ్యాఖ్య అభివృద్ధి చేసి శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా వ్యాక్సిన్పై సీరం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ 20 ఏళ్లపాటు ఎంతైనా అవసరం సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆదార్ పూనావాలా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభాలో 100 శాతం మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించినప్పటికీ కరోనా వైరస్ నియంత్రణ చేయటానికి ఒక్కటే మార్గం కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేవలం కరోనా విషయంలోనే కాదు అన్ని వైరస్ల విషయంలో ఇప్పటి వరకూ వివిధ దేశాలు ఎన్నో ఎన్నో రకాల టీకాలు కనుగొన్నాయి కానీ దేనిని కూడా ఇప్పటివరకు పూర్తిగా నిలిపి వేసిన దాఖలాలు మాత్రం లేవు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దాదాపుగా 2, 3 ఏళ్లకు ఒకసారి మళ్ళీ టీకా వేసుకునే అవసరం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆధార్ పూనావాలా.

20 ఏళ్ళు కరోనా టీకా ఎంతైనా అవసరం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts