ఏపీ లో కొత్తగా 4622 కరోనా పాజిటివ్ కేసులు..!

October 13, 2020 at 6:26 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన కొత్త కేసుల సంఖ్య మాత్రం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా వివరాలను తెలిపింది. ఏపీ హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 72, 082 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 4622 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఈ సంఖ్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,60,678 కి చేరుకుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 5715 మంది కరోనా నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 42,855 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

ఇక తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 35 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా బారినపడి మృతి చెందినవారి సంఖ్య 6291 కి చేరుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అలాగే అత్యధిక మరణాలు చిత్తూరు జిల్లాలో 714 సంభవించాయి.

ఏపీ లో కొత్తగా 4622 కరోనా పాజిటివ్ కేసులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts