
యువతకు డిజిటల్ లిటరసీ పై అవగాహన కల్పించడంతోపాటు, నైపుణ్యాన్ని అందించింది తెలంగాణ ఇరిగేషన్ టెక్నాలజీ అసోసియేషన్. ఈ అవగాహన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడంతో పాటు దాదాపు ఆరు వేల మందికి ఉపాధి కల్పించింది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్ ను టీటా ప్రెసిడెంట్ అయిన సందీప్ సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే సర్వేలో భాగంగా పది లక్షల ఇళ్లకు వాలెంటర్స్ వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వారి వివరాలను సేకరించారు అని తెలిపారు.
ఇవేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 573 ఇన్వెస్టిగేటర్ యూనిట్లు ఉన్నాయని, ఇక ఆ యూనిట్లలో పదిమంది వరకు ఎన్యూమరేటర్లు కావాలని ఆయన తెలియజేశారు. ఆసక్తిగల అభ్యర్థులు bit.ly/censussurvey వెబ్ సైట్ లో వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. మరిన్ని వివరాలకోసం 6300368705/ 9542809069/ 7989702090/ 9948185053 నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఎవరికైనా ఆసక్తి గల అభ్యర్థులు నమోదు చేసుకున్న వారికీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ డిజిటల్ సర్వే బాధ్యతలను సీఎస్సీ హైదరాబాద్ విభాగం మేనేజర్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.