బిగ్‌బాస్ ‌4: ఈ వారం ఆ ఆరుగురిలో ఒక‌రు ఔట్‌!

October 20, 2020 at 7:53 am

బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్ర‌స్తుతం ఏడో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ళ్యాణి, యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, గంగ‌వ్వ‌, సుజాత‌, కుమార్ సాయిలు ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ ముగిసింది.

అయితే ప్రతీసారి చేసుకున్నట్లు ఆరోపణలు, తిట్లు అవన్నీ లేవు. ఈ సారి సెల్ఫ్ నామినేషన్‌తో పాటు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలి. అయిన‌ప్ప‌టికీ ఏడోవారం నామినేషన్స్ ప్రక్రియ మంచి రంజుగా సాగుతోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో 12 మంది ఉండ‌గా.. వీరిలో రాజశేఖర్ మాస్టర్ గుండు కొట్టించుకుని నామినేష‌న్ నుంచి సేఫ్‌ అవ్వ‌గా.. నోయ‌ల్ అమీతుమీ టాస్క్‌లో సెల్ఫ్ నామినేట్ అయ్యాడు.

ఇక మిగిలిన 10 మంది రెండు రెండు జంటలుగా విడిగొట్టి.. వారిలో ఎవరు నామినేట్ కావాలో తేల్చుకోవాలని సూచించారు. అయితే చ‌ర్చ‌లు, ర‌చ్చ‌లు అనంత‌రం.. మోనాల్ గ‌జ్జ‌ర్‌, అరియానా, అవినాష్‌, దివి, అభిజిత్‌, నోయ‌ల్ నామినేట్ అయ్యారి. ఇక ఈ వారం ఈ ఆరుగురిలో ఒక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌నున్నారు.

బిగ్‌బాస్ ‌4: ఈ వారం ఆ ఆరుగురిలో ఒక‌రు ఔట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts