పెళ్లికి హెలికాఫ్టర్‌లో వెళ్లిన హైదరాబాద్ ఫ్యామిలీ.. ట్విస్ట్ ఏంటంటే?

October 29, 2020 at 8:31 am

హైద‌రాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ బంధువుల పెళ్లికి నెల్లూరుకి వెళ్లారు. అయితే ఏ కారులోనూ.. బైక్‌లోనూ కాదు. ప్రత్యేక హెలికాప్టర్లో సకుటుంబ సపరివారంగా హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్లారు. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే నెల్లూరు లోని అనంతసాగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. ఆ త‌ర్వాత కుటుంబసభ్యులతో కలిసి హెలికాప్టర్‌ దిగి అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంత‌రం పెళ్లికి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసి.. తిరిగి అదే హెలికాప్ట‌ర్‌లో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.

అస‌లు ట్విస్ట్ ఏంటంటే.. నెల్లూరు నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లిన ఆ హైద‌ర‌బాద్ ఫ్యామిలీపై పోలీసులు కేసు న‌మోదు చేసి షాక్ ఇచ్చారు. ఎందుకూ అంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండింగ్ ,టేకప్ చేసినందుకు స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స‌ద‌రు కుటుంబంపై కేసు న‌మోదు చేసి విచార‌ణ‌కు చేప‌ట్టారు.

పెళ్లికి హెలికాఫ్టర్‌లో వెళ్లిన హైదరాబాద్ ఫ్యామిలీ.. ట్విస్ట్ ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts