రూ.1 కే ఫ్లైట్‌ టిక్కెట్.. ఆక‌ట్టుకుంటున్న ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్!

October 26, 2020 at 2:28 pm

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్ర‌స్తుతం ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `శూరరై పోట్రు`. ఇదే చిత్రాన్ని తెలుగులో `ఆకాశం నీ హద్దురా` అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు మేక‌ర్స్‌. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఎయిర్ ద‌క్కన్ వ్యవ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘ‌ట‌న‌లు, క‌ష్టాల‌ను ఆధారం చేసుకొని రూపొందిన సినిమా ఇది.

ఈ చిత్రంలో అప‌ర్ణ బాల ముర‌ళి హీరోయిన్‌గా న‌టించారు. రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది. అయితే అమెజాన్ ప్రైమ్ ద్వారా న‌వంబ‌ర్ 12న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. పేద ప్రజలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేయాలన్న సంకల్పంతో ఓ విమాన సంస్థను స్థాపించాలనుకుంటారు. ఓ సామాన్య యువకుడు. ఆ క్రమంలో అతనెలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. మ‌రి ఆ ట్రైల‌ర్‌ను మీరు చూసేయండి..

రూ.1 కే ఫ్లైట్‌ టిక్కెట్.. ఆక‌ట్టుకుంటున్న ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts