బీబీఎల్‌ నుంచి తప్పుకున్న ఏబీ డివిలియర్స్‌..!?

October 27, 2020 at 6:13 pm

బిగ్‌బాష్‌ లీగ్ బీబీఎల్ సీజన్ నుంచి సౌత్ఆఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్ తప్పుకున్నట్లు సమాచారం. ఏబీ డివిలియర్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ బ్రిస్బేన్‌ హీట్‌ ఫ్రాంఛైజీ తరుపున మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

అలాగే ” త్వరలోనే ఏబీ డివిలియర్స్ భార్య డేనియల్‌ మూడో బిడ్డకు జన్మనివ్వడంపోతుంది… అందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము రాబోయే రోజులు మాకు చాలా ముఖ్యం… అలాగే కరోనా వైరస ప్రయాణ ఆంక్షలు, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం బీబీఎల్ సీజన్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ” డివిలియర్స్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ లో రాయల్ చాలెంజ్ బెంగళూరు తరపున ఆడుతున్నసంగతి అందరికి తెలిసిందే .

బీబీఎల్‌ నుంచి తప్పుకున్న ఏబీ డివిలియర్స్‌..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts