అభిజిత్ సారీ చెబితే.. అఖిల్‌కు హ‌గ్ ఇచ్చిన మోనాల్!

October 6, 2020 at 3:06 pm

బిగ్ బాస్ సీజ‌న్ 4.. ప్ర‌స్తుతం ఐదో వారంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఐదో వారం నామినేష‌న్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే సోమ‌వారం జ‌రిగిన ఈ నామినేష‌న్స్‌లో చిన్న పాటి యుద్ధ‌మే జ‌రిగింది. ‌ముఖ్యంగా అభిజిత్‌, అఖిల్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. పదే పదే మోనాల్‌ ప్రస్తావన తీసుకువచ్చి, వారిద్దరు గ‌ట్టి గ‌ట్టిగా అరుచుకోవ‌డంతో.. మోనాల్ గుక్క‌పెట్టి ఏడ్చేసింది.

తన కారెక్టర్‌ని బ్యాడ్‌ చేసి, జీవితాలతో ఆడుకోవద్దని సూచించింది. తన కారెక్టర్‌ని జడ్జ్‌ చేయడానికి మీరు ఎవరని, తన పరువును తీయకండి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే ఈ రోజు ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుద‌ల చేసింది. మోనాల్ ఐ లైక్ యూ చెప్పిన పాపానికి.. దాన్ని హౌస్ మొత్తం ప్ర‌చారం చేసి.. ఆమె క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసిన అభిజిత్‌.. ఇప్పుడు సింపుల్‌గా సారీ అనేస్తూ మోనాల్ కన్నీళ్లు తుడుస్తున్నాడు.

తాజాగా విడుద‌ల చేసిన ప్రోమోలో `నేను ఈ టాపిక్‌ని రేజ్ చేయలేదు.. అఖిల్ కావాలనే గొడవ పెట్టుకున్నాడు’ అంటూ సారీ చెబుతాడు. సీన్ క‌ట్ చేస్తే.. అఖిల్ మోనాల్‌తో గుసగుసలాడుతూ.. ‘వేరే అమ్మాయిదగ్గరకు వెళ్లి.. నీ గురించి చెప్పడం తప్పు.. నేను ఆ కోణంలో అడిగితే అతను వేరే విధంగా ప్రచారం చేశాడు.. నేను నీ గురించి ఇంతిలా కొట్లాడుతున్నానంటే.. వేరు టాపిక్ దొరకక కాదు’ అంటూ మోనాల్ కన్నీళ్లు తుడవగా అఖిల్‌ని దగ్గరకు తీసుకుని హగ్ ఇచ్చేసింది మోనాల్. ఏదేమైన‌ప్ప‌టికీ మోనాల్ అటు అభిజిత్‌ను, ఇటు అఖిల్ వ‌ద‌ల‌కుండా క‌థ న‌డిపిస్తూనే వ‌స్తోంది.

 

అభిజిత్ సారీ చెబితే.. అఖిల్‌కు హ‌గ్ ఇచ్చిన మోనాల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts