నాగిని అవతారంలో అల‌రించ‌నున్న అందాల భామ..!

October 28, 2020 at 4:53 pm

అల‌నాటి అందాల తార,అతిలోక సుందరి శ్రీదేవి లీడ్ రోల్ లో న‌టించిన నాగిన‌, నిగాహెన్ చిత్రాలు ప్రేక్ష‌కులను ఎంత‌గా అలరించిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. డైరెక్ట‌ర్ విశాల్ ఫురియా, నిర్మాత నిఖిల్ ద్వివేది నాగిన్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నట్టు ప్ర‌క‌టించిన విష‌యం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి అందాల భామ అయిన శ్ర‌ద్దాక‌పూర్ లీడ్ రోల్ పోషించ‌నుంది. శ్ర‌ద్దాక‌పూర్ ఈ విష‌యాన్ని తన ట్విటర్ ద్వారా అందరితో పంచుకుంది.

ఈ చిత్రంలో నాగిన్ పాత్ర‌లో న‌టించ‌డం చాలా గ‌ర్వంగా భావిస్తున్నా. నేను నటి శ్రీదేవి ‘నాగిన’‌, ‘నిగాహెన్’ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించాల‌న్న‌ది నాకు చిన్నప్పటినుండి ఉన్న కోరిక అంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా త‌న ఆనందాన్ని షేర్ చేసుకుంది శ్రద్ధ. ఈ ఏడాది స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3, బాఘీ చిత్రాల‌తో ప్రేక్ష‌కులు ముందుకు వచ్చింది శ్ర‌ద్దాక‌పూర్. కానీ ఈ 2 సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని సొంతం చేసుకోలేకపోయాయి.

 

నాగిని అవతారంలో అల‌రించ‌నున్న అందాల భామ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts