అదనపు కట్నం వేధింపులు.. గర్భిణీ ప్రాణం పోయింది..?

October 22, 2020 at 4:37 pm

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మహిళలు అదనపు కట్నం వేధింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన సదరు యువతికి కొన్ని రోజుల వ్యవధిలోనే అత్తవారింటి అసలు రూపం బయటపడడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

రోజురోజుకు అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ అవుతున్న తరుణంలో చివరికి అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక కఠిన నిర్ణయం తీసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన ఘటన హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహిత కృష్ణప్రియ అనే ఐదు నెలల గర్భిణీ ఇటీవలే ఆత్మహత్య మృతి చెందింది. దీంతో అత్తమామలు అదనపు కట్నం వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని కృష్ణప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదనపు కట్నం వేధింపులు.. గర్భిణీ ప్రాణం పోయింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts