నాని హీరోయిన్‌తో జ‌త‌క‌ట్ట‌నున్న‌ శ‌ర్వానంద్!

October 12, 2020 at 12:29 pm

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తన త‌దుప‌రి చిత్రం ‘మహా సముద్రం’ గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్ హీ‌రోగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా చాలా కాలం తరువాత సిద్ధార్ధ్ తెలుగులో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌, సిద్దార్థ్‌ పాత్రలు పోటాపోటీగా సాగుతాయ‌ని అంటున్నారు.

Sufiyum Sujatayum' is special: Aditi Rao Hydari | Aditi Rao Hydari  Mollywood comeback| OTT release

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమాలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా అదితి రావు హైదరి నటించబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. `ప్రతి ప్రకటనతో మహాసముద్రం మరింత పెద్దదవుతోంది. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.

Maha Samudram: Aditi Rao Hydari to play female lead in Siddharth and  Sharwanand film - Movies News

ఇప్పుడు అద్భుతమైన, అందమైన అదితీ రావు హైదరీ ఇందులో హీరోయిన్‌గా కన్ఫర్మ్‌ అయ్యింది.` అని చిత్ర యూనిట్ తాజాగా ప్ర‌క‌టించింది. కాగా, ఇటీవ‌ల ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `వి`లో నానికి జోడీగా అదితిరావు హైద‌రి ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. వి చిత్రంలో ఆమె పాత్ర చిన్న‌దే అయినా.. ఉన్నంత సేపు అదితి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను బాగానే అల‌రించింది. అయితే ఇప్పుడు నాని హీరోయితోనే శ‌ర్వానంద్ జ‌త‌క‌ట్ట‌నున్నాడు.

నాని హీరోయిన్‌తో జ‌త‌క‌ట్ట‌నున్న‌ శ‌ర్వానంద్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts