అవ‌న్నీ అబ‌ద్ధాలే.. ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`లో కొత్త ట్విస్ట్‌!

October 25, 2020 at 8:50 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ఆదిపురుష్‌` ఒక‌టి. రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీలో పలు భాషల నుంచి స్టార్‌ నటీనటులు భాగం అవ్వబోతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఇందులో శివుడి పాత్ర కూడా ఉండటంతో ఆ పాత్రకు గానూ అజయ్ దేవగన్ న‌టించ‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు ఫినిష్ అయ్యాయని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ, ఈ ప్ర‌చారాలు అబ‌ద్ధాలే అని తేలిపోయింది.

తాజాగా ఈ ప్రచారాన్ని అజయ్ దేవగణ్ టీమ్ ఖండించింది. ఆదిపురుష్ సినిమా కోసం అజయ్ ను ఎవరూ ఇంత వరకు కలవలేదని చెప్పింది. అవన్నీ ఫేక్ వార్తలని.. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలకు బ్రేక్‌ పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. కాగా, గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D మూవీగా రూపొందనున్న ఈ చిత్రం 2020లో విడుద‌ల కానుంది.

Ajay Devgan: Ajay Devgn: I want to work with great scripts, it doesn't  matter whether it's in Hindi or Marathi | Hindi Movie News - Times of India

అవ‌న్నీ అబ‌ద్ధాలే.. ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`లో కొత్త ట్విస్ట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts