అక్రమ నిర్మాణాలపై.. కేసిఆర్ సర్కారు ఉక్కుపాదం..?

October 17, 2020 at 7:00 pm

హైదరాబాద్ నగరం మొత్తం భారీ వర్షం ద్వారా వచ్చిన వరదలతో పూర్తి అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు సాధారణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో వెళ్లిపోయి నగరం మొత్తం వరదల్లో మునిగి పోయింది. జనావాసాల్లోకి నీరు రావడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎటుచూసినా పూర్తిగా నీరు నిండి పోయి పెద్ద పెద్ద చెరువులను తలపించిన నేపథ్యంలో… ఎటు వెళ్ళాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే హైదరాబాద్ లో వరదలు విలయం సృష్టించడానికి కారణం అక్రమ కట్టడాలు అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్టు తెలిసింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో అక్రమకట్టడాల కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. మల్కాజిగిరి నియోజకవర్గం లో నిన్న పర్యటించిన మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలను భూస్థాపితం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేసే పనిలో పడ్డారు స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తు అక్రమ కట్టడాలను కూల్చివేయిస్తున్నారు .

అక్రమ నిర్మాణాలపై.. కేసిఆర్ సర్కారు ఉక్కుపాదం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts