లక్ష్మీ బాంబ్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రాన్స్ జెండర్స్ ని ఆలింగనం చేసుకున్న అక్షయ్..!

October 20, 2020 at 7:04 pm

మనం ఒక సినిమాను చూసి ఆ సినిమా గురించి ఒక్క మాటలో బాగుంది.. బాగోలేదు అని సర్టిఫికెట్ ఇచ్చేస్తూ ఉంటాము. కానీ, ఆ సినిమాను తెరకెక్కించడానికి, ఆ మూవీని ప్రమోట్ చేసి ప్రేక్షకులలోకి తీసుకుని వెళ్ళడానికి చిత్ర బృందం పడే కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. అయితే కొన్ని సినిమాలు ప్రమోషన్ వల్ల కూడా జనాల్లోకి వెళ్ళతాయని దర్శక.. నిర్మాతలు ప్రమోషన్ కి కూడా భారీగా ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడదే తరహాలో ‘లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారట ఆ చిత్ర హీరో.. హీరోయిన్.. ఈ చిత్రంలో బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఒక ట్రాన్సజెండర్ పాత్రను పోషిస్తున్నాడు. హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ‘లక్ష్మీ బాంబ్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు లారెన్స్. కొరియోగ్రాఫర్.. హీరో.. డైరెక్టర్. .ప్రొడ్యూసర్ ఇలా అన్ని లక్షణాలు ఉన్న నటుడు లారెన్స్. లక్ష్మి బాంబ్ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకుడు. ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ లో అక్షయ్ నటన అందరిని ఆకట్టుకుంటుంది.

‘అక్షయ్ ఇటువంటి పాత్రను చేయడమే నిజంగా సాహసమే’ అంటూ అమీర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సినిమా హీరో హీరోయిన్లు అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రమోషన్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా వీళ్లు ట్రాన్స్ జెండర్స్ రైట్స్ కార్యకర్త లక్ష్మీ నారాయాన్ త్రిపాఠి ని కలుసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. ఈ సినిమా హర్రర్ – కామెడీతో తెరకెక్కింది. తెలుగులో కాంచన సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

లక్ష్మీ బాంబ్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రాన్స్ జెండర్స్ ని ఆలింగనం చేసుకున్న అక్షయ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts