‘అల’ విలన్ ను మళ్లీ ఢీ కొట్టనున్న బన్నీ..?

October 21, 2020 at 5:52 pm

అలా వైకుంఠపురం లాంటి భారీ హిట్ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ మరోసారి తన హిట్ దర్శకుడు సుకుమార్ తో జోడి కట్టిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అయినా పుష్ప సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎంతో మాస్ లుక్ తో ఉండబోతుందని విడుదలైన ఫస్ట్ లుక్ తో అర్థమైన విషయం తెలిసిందే. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఢీకొట్టే విలన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్నది గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి మాధవన్ సహా మరికొంతమంది తమిళ నటులు పేర్లు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి. చిత్ర బృందం మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పుష్ప సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని నటించనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సముద్రఖని అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి అల్లు అర్జున్ అదే విలన్ ను ఢీకొట్టినున్నాడట.

‘అల’ విలన్ ను మళ్లీ ఢీ కొట్టనున్న బన్నీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts