జ‌క్కన్న‌ చేతిలో బుక్కైన అలియా.. ఇక బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మే!

October 29, 2020 at 12:16 pm

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీంగా, రామ్ చ‌ర‌న్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. అలాగే చిత్రంలో ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది.

అయితే ప్ర‌భావం లాక్‌డౌన్ నుంచి స‌డలింపులు ఇవ్వ‌డంతో.. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో సీతగా నటించనున్న అలియా భట్ నవంబర్ 2 నుంచి షూటింగ్‌లో పాల్గొగనున్నట్లు తెలుస్తోంది. అలియా పై రామోజీ ఫిలిం సిటీలో ఒకే షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారని స‌మాచారం.

అందుకోసం అలియా ఇక్కడ ఒక నెల రోజులు స్టే చేస్తుందట. ఇక సీత పాత్రధారిపై చిత్రీకరణ అంతా ఫిలింసిటీలోనే కాబ‌ట్టి.. ఆ పరిసరాల్ని అలియా వదిలి వెళ్లకుండా అక్క‌డే బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్భందీగా రాజ‌మౌళి ప్లాన్ చేశారట. దీంతో జ‌క్క‌న్న మైండ్‌సెట్ తెలిసిన కొంద‌రు.. షూటింగ్ అయ్యే వ‌ర‌కు అలియ‌ను వ‌ద‌ల‌ర‌ని అంటున్నారు. జ‌క్కన్న‌ చేతిలో బుక్కైన అలియా బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మే అంటూ ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.

జ‌క్కన్న‌ చేతిలో బుక్కైన అలియా.. ఇక బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts