రంపచోడవరంలో మ‌కాం వేయ‌నున్న బ‌న్నీ‌.. ఎందుకంటే?

October 9, 2020 at 9:02 am

టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పుష్పక్ నారాయణ్ పాత్రలో అల్లు అర్జున్ క‌నిపించ‌నున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ క్ర‌మంలోనే మొదట అనుకొన్న ప్రకారం కేరళలోనే షూటింగ్‌ చేయడానికి యూనిట్‌ సిద్ధమైంది. అయితే ఇప్పటికీ కేరళలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడంతో చివరి క్షణంలో వెనక్కి తగ్గి.. రంపచోడవరం వెళ్లడానికి దర్శకనిర్మాతలు సిద్ధం అయ్యారు.

నవంబర్‌ 2 నుంచి నెల రోజుల పాటు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌, ర‌ష్మిక పాల్గొనున్నారు.రోజుల పాటు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లో యాక్షన్‌ పార్ట్‌, హీరోహీరోయిన్లు పాల్గొనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ నెల రోజుల పాటు రంపచోడవరంలో మ‌కాం వేయ‌నున్నాడు.

రంపచోడవరంలో మ‌కాం వేయ‌నున్న బ‌న్నీ‌.. ఎందుకంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts