`మోసగాళ్లు` స్కామ్ ను బ‌య‌ట‌పెట్టేసిన‌ బన్నీ.!

October 3, 2020 at 9:40 am

మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ థ్రిల్లర్‌ మూవీని నిర్మిస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్లు’ చిత్రం రూపొందుతోంది. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీచిన్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ చిత్రంలో విష్ణుకు చెల్లెలి పాత్ర‌లో కాజ‌ల్ న‌టిస్తోంది. సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవ‌ర్ ఫిల్మ్‌ను నిర్మాత‌లు విస్తృతంగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం గ్లింప్స్‌ ప్రోమోను అక్టోబర్‌ 3న అల్లు అర్జున్‌ విడుదల చేయబోతున్నట్లు మంచు విష్ణు ఇప్ప‌టికే తెలిపారు.

అయితే చెప్పిన‌ట్టుగానే అల్లు అర్జున్ మోస‌గాళ్లు టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజర్ విషయానికి వస్తే 2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ కోసం అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడ్రెస్ చేస్తున్న స్పీచ్ తో మొదలయ్యి.. ఆ భారీ మొత్తాన్ని కొట్టేసే జంటగా విష్ణు అండ్ కాజల్ ఎండింగ్ ఇచ్చారు. మొత్తానికి అయితే మంచి ఆసక్తికరంగానే ఈ టీజర్ ఉంది. మ‌రి దానిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

`మోసగాళ్లు` స్కామ్ ను బ‌య‌ట‌పెట్టేసిన‌ బన్నీ.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts