బన్నీ ఖాతాలో సెన్సేష‌న‌ల్‌ రికార్డ్‌.. నెక్స్ట్ టార్గెట్ అదే?

October 7, 2020 at 8:20 am

అల్లు అర్జున్ మ‌రో సెన్షేష‌న‌ల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠపురములో`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. త్రివిక్రమ్ మాయకు తమన్ సంగీతానికి అల్లు అర్జున్ నటన, డాన్స్ ఈ సినిమాకు పెద్ద ఎస్పెట్స్‌గా నిలిచాయి.

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. అందులో `బుట్టబొమ్మ` సాంగ్ అయితే ఇప్పటికీ అలా భారీ రికార్డులు నెలకొల్పుతూనే ఉంది. యూట్యూబ్‌లో మిలియన్ దగ్గర ప్రారంభమైన బుట్టబొమ్మ ఊచకోత.. 10 మిలియన్, 100 మిలియన్‌, 150 మిలియన్, 200 మిలియన్, 300 మిలియన్ అంటూ మిలియన్ల వేట కొనసాగిస్తున్న ఈ పాట తాజాగా తెలుగులో ఏకంగా 400 మిలియన్ వ్యూస్ ను టచ్ చేసి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది.

ఇక దీని తర్వాత బన్నీ టార్గెట్ హాఫ్ బిలియనే అని చెప్పాలి. ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. ఇప్ప‌టికీ ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. కాగా, ఈ చిత్రంలో హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

బన్నీ ఖాతాలో సెన్సేష‌న‌ల్‌ రికార్డ్‌.. నెక్స్ట్ టార్గెట్ అదే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts