నానిని బీట్ చేసిన అనుష్క‌.. `నిశ్శబ్దం` న్యూ రికార్డ్‌?

October 18, 2020 at 11:31 am

లేడీ ఓరియంట‌డ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన అనుష్క చాలా కాలం త‌ర్వాత న‌టించిన చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ రిలీజైంది.

అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులైతే తక్కువ మార్కులే వేశారు. అయితే తాజ‌గా ఈ చిత్రం కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో నిశ్శబ్దంను ఎక్కువ మందిని వీక్షించిన‌ట్టుగా స‌మాచారం. నిశ్శబ్దం కంటే ముందు నాని, సుథీర్ బాబు క‌లిసి నటించిన ‘వి’ కూడా అమెజాన్‌లో విడుదల అయ్యింది.

అఇతే దాని కంటే ఎక్కువ మంది నిశ్శబ్దం చిత్రాన్ని చూసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నో అంచ‌నాలు మ‌ధ్య వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. ఓటీటీలో బాగానే దూసుకుపోతోంది. కాగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతం అందించారు.

నానిని బీట్ చేసిన అనుష్క‌.. `నిశ్శబ్దం` న్యూ రికార్డ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts