మ‌హిళ‌కు మ‌ర‌ణ‌శిక్ష‌.. అదీ 67ఏళ్ల త‌రువాత అమెరికాలో..

October 19, 2020 at 2:25 pm

ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొన‌సాగుతున్న‌ది. బిడెన్ గెలుస్తాడా? ట‌్రంప్ విజ‌య‌ఢంకా మోగిస్తాడా? అని ప్ర‌పంచ వ్యాప్తంగానూ చ‌ర్చ కొన‌సాగుతున్న‌ది. అయితే అంత హోరులో ఇప్పుడు అక్కడ మ‌రో అంశంపైనా అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. సాధారణంగా మరణశిక్షల బారిన‌ ఎక్కువ‌గా పురుషులే ప‌డుతుంటారు. కాని ఇక్క‌డ ఓ మ‌హిళ‌కు విధించ‌డమే. అదికూడా సుమారు 67ఏళ్ల త‌రువాత తొలిసారిగా అమెరికా న్యాయం స్థానం విధించ‌డం మ‌రింత హాట్ టాపిక్ అయింది. అందుకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు ఇటీవ‌లేనే వెల్ల‌డించ‌గా.. సోష‌ల్‌మీడియాలో ఈ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

అమెరికాకు చెందిన లిసా మోంట్‌గో మొరీ 2004లో ఓ 8 నెలల గర్భిణీని గొంతు పిసికి చంపింది. ఆ తర్వాత ఆమె కడుపును కోసేసి… గర్భంలోని శిశువును ఎత్తుకెళ్లింది. అంత‌టి ఘాతుకానికి పాల్ప‌డిన ఆమెకు 2008లో కోర్టు మరణశిక్ష విధించింది. అయితే 2003 నుంచి అమెరికాలో మరణశిక్షలను ఆపేశారు. అందువల్ల అమ‌లు చేయ‌లేదు. అయితే ఇటీవ‌ల‌నే జూలైలో ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 2న ముగిశాక… డిసెంబర్ 18న లీసాకు మరణశిక్ష అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు. అందుకోసం ఆమెను ఉరి తియ్యరు. సింపుల్‌గా విషపూరితమైన ఇంజెక్షన్ ఇస్తారు. అంతే… అది బాడీలోకి వెళ్లగానే… నెమ్మదిగా బ్రెయిన్ మొద్దుబారేలా చేస్తుంది. తర్వాత నాడీ వ్యవస్థ పనిచేయడం మానేస్తుంది. దాంతో ఆమె చనిపోతుంది. ఈ వివరాల్ని అమెరికా న్యాయ విభాగం తెలిపింది. ఇదిలా ఉండ‌గా.. అమెరికాలో 1953 డిసెంబర్ 18న బోనీ బ్రౌన్ హెడీ అనే మహిళకు మరణ శిక్ష అమలైంది. కిడ్నాప్, హత్య కేసులో ఆమెను ఉరితీశారు. సుమారు 67 ఏళ్ల త‌రువాత ఇప్పుడు అమ‌లు చేయ‌నుండ‌డంతో ప్రపంచ దేశాలు దీనిపై చర్చించుకుంటున్నాయి.

మ‌హిళ‌కు మ‌ర‌ణ‌శిక్ష‌.. అదీ 67ఏళ్ల త‌రువాత అమెరికాలో..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts