నామినేష‌న్ నుంచి సేఫ్ అయ్యేందుకు అమ్మ రాజశేఖర్ షాకింగ్ నిర్ణ‌యం!

October 17, 2020 at 4:22 pm

బిగ్ బాస్ సీజ‌న్ 4.. ఆరు వారాలు పూర్తి చేసుకుబోతుంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ ఇంటి నుంచి సూర్య కిర‌ణ‌, క‌రాటే క‌ళ్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, గంగ‌వ్వ మ‌రియు సుజాత ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వారం అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు నామినేట్ అవ్వ‌గా.. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న‌ది ఉత్కంఠగా మారింది.

అయితే తాజాగా ఇవేళ ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుద‌ల చేసింది. ఇందులో నామినేష‌న్ నుంచి సేఫ్ అయ్యేందుకు అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకుని.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మొన్ని జ‌రిగిన అమీ తుమీ టాస్క్‌లో బిగ్ బాస్ అర గుండు మ‌రియు అర మీసం చేయించుకోవాల‌ని డీల్ ఇవ్వ‌డంతో.. దాన్ని చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. అమ్మ‌ రాజ‌శేక‌ర్ వ‌చ్చినా.. ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నాడు.

ఇప్పుడు అదే డీల్‌ను నాగార్జున‌ వీకెండ్‌లో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైనా అలా చేస్తే నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లేకుండా చేస్తానంటూ మాటిచ్చాడు. ఈ సారి కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. కానీ, అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ చేస్తాన‌న్నాడు. మిగిలిన ఇంటి స‌భ్యులు వ‌ద్దంటున్నా.. మాస్ట‌ర్ మాత్రం మ‌న‌సు మార్చుకోలేదు. చివ‌ర‌కు ఆయన సగం గుండు కొట్టించుకున్నాడు.. దాంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. దివి అయితే ఏడ్చేసింది కూడా. మ‌రి ఆ త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతుంది అన్న‌ది ఆ రోజు ఎపిసోడ్‌లో తెలియ‌నుంది.

నామినేష‌న్ నుంచి సేఫ్ అయ్యేందుకు అమ్మ రాజశేఖర్ షాకింగ్ నిర్ణ‌యం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts