పట్టాల ఎక్కనున్న మరో 900 రైలు…!

October 19, 2020 at 6:07 pm

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే సీపీఆర్వో రాకేష్‌ తెలిపారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు స్టేషన్లలోకి అనుమతించడం లేదు.కేవలం రిజర్వేషన్లు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం అనుమతి ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పండుగ సమీపిస్తున్న సమయంలో సోమవారం సాక్షితో మాట్లాడిన సీపీఆర్వో రాకేష్ పలు విషయాలు తెలిపారు. స్టేషన్‌లో ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని రాకేష్ పేర్కొన్నారు.

ఇదే విధంగా రైల్వే స్టేషన్‌లో బుకింగ్‌ సదుపాయం కూడా ఉందని, ఆన్‌లైన్‌ ద్వారా కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఏసీ బోగీల్లో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వటం లేదని.భోజనం కూడా ఇంటి నుండే తెచ్చుకుంటే మంచిదని రాకేష్ సూచించారు. క్యాటరింగ్‌ ఫుడ్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకులంతా తూచా తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించి తీరాలని,స్టేషన్‌లో నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు సీపీఆర్వో రాకేష్.

పట్టాల ఎక్కనున్న మరో 900 రైలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts