కరోనా వైరస్ బారిన పడిన మరో మంత్రి..!

October 7, 2020 at 7:19 pm

కేరళ రాష్ట్రంలో మరో మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి ఎంఎం మణికి నేడు నిర్వహించిన కోవిడ్ పరీక్షలలో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల మంత్రిని కలిసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలను అందర్నీ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం మంత్రి మణి తిరువనంతపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స అందచేస్తున్నారు.

ఇక కేరళ క్యాబినెట్ లో కరోనా వైరస్ బారినపడిన మంత్రుల సంఖ్య ఇప్పటికీ నాలుగుకు చేరుకుంది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్‌, పరిశ్రమల మంత్రి ఈపీ జయరాజన్‌, వ్యవసాయ మంత్రి వీఎస్ సునీల్‌కుమార్ లకు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ బారిన పడిన మరో మంత్రి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts