కోవిడ్ వ్యాధిని గుర్తించే ప్ర‌దాన‌మైన ఫ్లూ ల‌క్ష‌ణాల‌ను నివారించ‌డానికి మరో కొత్త ఔష‌ధం మార్కెట్ లోకి విడుదల..!

October 19, 2020 at 6:20 pm

కోవిడ్ కు వాక్సిన్ ను క‌నుగొనే ప్రయత్నంలో భార‌త్ బ‌యోటెక్ లాంటి సంస్థ‌లు ఉంటే, ఇప్పుడు సరికొత్తగా మ‌రో సంస్థ కోవిడ్ వ్యాధిని గుర్తించ‌డానికి ఇంకా ప్ర‌దాన‌మైన ఫ్లూ ల‌క్ష‌ణాల‌ను నివారించ‌డానికి ఒక కొత్త ఔష‌ధాన్ని మార్కెట్ లో విడుద‌ల చేశారు. కోవిడ్ ను పూర్తిగా అరికట్టక పోయినా దాని తీవ్ర‌తను త‌గ్గించేందుకు కొత్త త‌ర‌హా మందుల‌ను క‌నిపెట్టెందుకు హైద‌రాబాద్ కు చెందిన అనేక ఫార్మాసిట‌క‌ల్ కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్ లాంటి సంస్థ‌లు కోవిడ్ కు వాక్సిన్ ను క‌నిపెట్టే ప్రయత్నంలో ఉంటే, ఇప్పుడు మ‌రో సంస్థ కోవిడ్ వ్యాధిని గుర్తించ‌డానికి క‌నిపించే ప్ర‌దాన‌మైన ఫ్లూ ల‌క్ష‌ణాల‌ను నివారించ‌డానికి ఒక కొత్త ఔష‌ధాన్ని మార్కెట్ లో విడుద‌ల చేశారు.లీ హెల్త్‌ డొమెయిన్‌ సంస్థ వారు ఫ్లూ నివారణకు స్టీమ్‌ మంత్ర, రోల్‌ ఆన్‌ కోల్డ్‌ పేరుతో ఆయుర్వేద ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్ లోకి విడుద‌ల చేసింది.

ఫ్లూ కారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యకు ఇది చక్కని పరిష్కారాన్ని చూపిస్తాయ‌ని సంస్థ ప్ర‌తినిధులు చెప్తున్నారు.ఈ ఉత్పత్తులను ఆయుర్వేద గ్రంధాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అనేక పరిశోధనలు జరిపిన అనంతరం వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు కంపెనీ డైరెక్టర్‌ లీలా రాణి తెలిపారు. ఈ స్టీమ్‌ మంత్ర చుక్కలను వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టడం,రోల్‌ ఆన్‌ కోల్డ్‌ను నుదురు,గొంతు భాగాల పై రాయడం ద్వారా సత్వర ఉపశమనం ఉంటుందని చెప్పారు. దీని కాంబో ప్యాక్‌ ధర రూ.135 ఉండగా,మందుల షాపులు తోపాటు ఆన్‌లైన్లో కూడా ‌ లభిస్తుంది.

కోవిడ్ వ్యాధిని గుర్తించే ప్ర‌దాన‌మైన ఫ్లూ ల‌క్ష‌ణాల‌ను నివారించ‌డానికి మరో కొత్త ఔష‌ధం మార్కెట్ లోకి విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts